ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసేందుకు అక్కడి అనేక రైతులు తమభూములను ప్రభుత్వానికి ఇచ్చేశారు.
అయితే తాజాగా భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని రైతులు నిర్విరామంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.