పొలిటికల్ ఐ సెప్టెంబర్ 15 : చాలా మంది తమకు తెలిసిన విద్యను ఎంతో కొంత తీసుకొని చేస్తారు..ఇక కారోనో లాంటి వ్యాధి వల్ల లాక్ డౌన్ తో
ప్రపంచం తలకిందులైంది.ముఖ్యంగా పేద ,మధ్యతరగతి వారికి ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడ్డారు చెప్పాలంటే ఇంకా పడుతున్నారు.ఇలాంటి సమయంలో తమకు తెలిసిన విద్యను ఎవరు ఫ్రీ గా చెయ్యరు.కానీ ఇక్కడ గోపి అనే ఒక వ్యక్తి మాత్రం తనకు తెలిసిన విద్యని విరాళంగా ఇస్తున్నాడు కారోనో సమయంలో .
గోపి ది బార్బర్ వృత్తి..లాక్డౌన్ కారణంగా బార్బర్ షాపులు కూడా తీవ్రంగా నష్టపోయాయి. లాక్డౌన్ తొలగించినా బార్బర్ షాపులకు వెళ్లడానికి ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తనలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి చేతనైన సాయం చేయాలని కేరళకు చెందిన గోపి అనుకున్నాడు. కోచి ప్రాంతంలో ఇతనికి ఓ హెయిర్ సెలూన్ ఉంది.సాయం చేసేందుకు తన వద్ద బార్బర్ విద్య తప్ప, డబ్బు లేదు . అందుకే తన విద్యనే విరాళం ఇవ్వాలనుకున్నాడు. 14ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని బోర్డు పెట్టేశాడు. ఇది చూసిన చాలామంది అల్పాదాయ వర్గాల వారు గోపీ షాపుకు క్యూ కడుతున్నారు. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం కూడా కష్టమైందని, దీంతో కనీసం పిల్లలకు హెయిర్ కట్ చేయించే స్థోమత కూడా తమకు కరువైందని వీళ్లు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో గోపీ సాయం తమకు చాలా మేలు చేస్తోందంటున్నారు.మామూలుగా హెయిర్ కట్ చేస్తే 100 రూపాయలు చార్జ్ చేస్తాం. కానీ ఈ కరోనా కాలంలో ఎవరి దగ్గరా సరిగా డబ్బులేదు. అందుకే వారిపై భారం తగ్గించేందుకు పిల్లలకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నాని గోపి తెలిపాడు.ఇది తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు.ఓక్కోసారి పెద్దవాళ్లు కూడా 100 రూపాయలు ఇవ్వలేరు. అప్పడు వారు ఇచ్చినంతే సంతోషంగా తీసుకుంటా” అని గోపీ చెప్పాడు.చూసారు కదా ఎంత పెద్ద మనసో సహాయం చేయాలంటే మనిషికి కావాల్సింది డబ్బు కాదు సహాయం చేయాలనే మనసు ఉండాలని గోపి నేర్పిన పాఠం..