Politicla Eye

కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో నలుగురు హతం

శ్రీనగర్: సోఫియాన్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. కిలూరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారని భద్రతా బలగాలు నిర్థారించాయి.

కిలూరి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్క సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని జల్లెడ పట్టాయి. గాలింపు చేస్తున్న వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా, రక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మరికొందరు ఉన్నారనే సమాచారం ఉండడంతో ప్రతి ప్రాంతాన్ని తనిఖీ చేస్తుననారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like