హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు కరోనా బాధితులు పరారీ అయ్యారు. చర్లపల్లి జైల్లో నలుగురు ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ట్రీట్ మెంటు పొందుతున్న నలుగురు ఖైదీలు సిబ్బంది, బందోబస్తు పోలీసుల కన్నుగప్పి పరారీ అయ్యారు. ఈ విషయాన్ని చర్లపల్లి జైలు అధికారులకు తెలియచేయడంతో పోలీసులను అప్రమత్తం చేశారు. పరారీ అయిన వారి కోసం గాలింపు మొదలు పెట్టారు.