అమరావతి: మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. 76 రోజులుగా రిమాండ్ లో ఉన్న ఆయన కరోనా పాటిజివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కోర్టు బెయిల్ పత్రాలు అందగానే ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ చేసే అవకాశాలు ఉన్నాయి.