చెన్నై: చీరల్లో భారీగా ఫారెన్ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడిన ఘటన చెన్నై ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ముఠా.. సుమారు రూ.1 కోటీ 36 లక్షల విలువైన ఫారెన్ కరెన్సీ కొత్త చీరల్లో ప్యాక్ చేసి తరలిస్తుండగా.. పట్టుబడింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.