ఢిల్లీ: యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆఖరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా ఎవరినీ ప్రమోట్ చేయవద్దని సూచించింది.
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలపై పలు విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు యూజీసీ నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఇప్పటికే ఐదు సెమిస్టర్లు పరీక్షలు రాశారని, కరోనా కారణంగా ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోతున్నారని పిటీషన్లు తెలిపారు. ఐదు సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరో సెమిస్టర్ లో మార్కులు వేసి ప్రమోట్ చేయాల్సిందిగా కోరారు.
వైరస్ కారణంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూజీసీ ప్రకటించింది. పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే విధాన్ని ప్రోత్సహించవద్దని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.