Politicla Eye

ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు మరణం..

ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like