హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి నాలుగు ఇండ్లు కుప్పకూలాయి. ఈ ఘటన కులూ జిల్లా మలానా గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. మలానా గ్రామంలో కొండచరియలు ఒక్క సారిగా విరిగిపడడంతో 4 ఇండ్లు కుప్పకూలాయి. అయితే ఈ ఘటనలో ప్రాణహానీ ఏమీ జరగలేదు. పలువురికి స్వల్పగాయాలైనాయి.