మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ విహెచ్
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 8: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి.హనుమంతరావు మరోసారి తన మానవత్వం చాటుకున్నారు..ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చిన అక్కడికి వాలిపోయి తన వంతు సహాయం అందించి వచ్చే దాదా ఈ సారి మీడియా మిత్రులకు తన వంతు తిను బండరాలు, మంచి నీళ్లు ,పండ్లు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.అసలు ముచ్చట ఏంటి అంటే తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కదా..!ఈ సారి మీడియా కి ఎంటరీ లేదు కోవిడ్ నేపధ్యం లో దింతో మీడియా వాళ్ళు గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఉండి విధులు నిర్వహిస్తున్నారు. దింతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయా పార్టిల నాయకుల వార్తలు కవరేజ్ నిమిత్తం అమరవీరుల స్తూపం, గన్ పార్క్ ఉన్న వివిధ మీడియా సంస్ధల ప్రతినిధులకు అరటి పండ్లు,మంచి నీళ్లు,మరికొన్ని తినుబండారాలను పంపిణీ చేశారు విహెచ్….