Politicla Eye

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

పొలిటికల్ ఐ :తెలంగాణలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం  ప్రారంభించింది.2021  మార్చి 29తో మహబూబ్‌ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలు ఖాళీ కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కోటా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. 2021 మార్చి 29తో ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇరు రాష్ట్రాల ఓటర్ల జాబితా తయారీ కోసం 2020 అక్టోబరు 1న ఈసీ నోటీసు ఇవ్వనుంది. ఓటరు నమోదు కోసం దరఖాస్తులకు నవంబర్‌ 6 వరకు ఈసీ గడువు ఇచ్చింది. 2021 జనవరి 1న ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది..పార్టీ లు అనుసరించాల్సిన వ్యూహాలు,అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల ను ఎలా మజ్జికా చేసుకోవాలనే పనిలోంపడ్డారనే అనుకోవాలి..మరి ఏసీ ప్రక్రియతో మరింత వేగం పెరిగే అవకాశము ఉంది..

Get real time updates directly on you device, subscribe now.

You might also like