పొలిటికల్ ఐ: దుబ్బాక ఉపఎన్నికల బెల్ మోగింది అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఐతే బీజేపీ అభ్యర్థి రఘునందగన్ రావు పై మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి.రేపిస్టులకు ఎలా టికెట్స్ ఇస్తారని ప్రశ్నించారు.ఇటీవలే కాలంలో రఘునందన్ రావు పై వచ్చిన ఆరోపణల పై ఆయన కామెంట్ చేశారు. ఇలాంటి వారికి టికెట్ లు ఇచ్చి ప్రజలకు ఏలాంటి సంకేతాలు పంపుతారని , బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాస్ బీజేపీ జాతీయ నాయకత్వానికి తప్పుడు సమాచారం పంపారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే దుబ్బాక లో బీజేపీ ఎలా గెలిచేదని కమలాకర్ వ్యాఖ్యానించారు. రఘునందన్ రావు టికెట్ విషయంలో బీజేపీ పునరాలోచన చేయాలి కోరారు. ఐతే తోట కమలాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం గా ఉంది.దింతో కమలాకర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ ..
Get real time updates directly on you device, subscribe now.
Next Post