హైదరాబాద్: చిక్కకుండా తిరుగుతున్న చిరుతపులి కోసం అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫామ్ హౌస్ శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఇవాళ సందర్శించారు.
రాజేంద్రనగర్ సీఐ సురేష్ తో పాటు అటవీశాఖ అధికారులు కూడా ఫామ్ హౌస్ లో తనిఖీ చేశారు.
రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుత జాడలు కనుక్కోవడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు జాగిలాలను (కుక్కలు) సైతం రంగంలోకి దించారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు అక్కడక్కడ బోను లను కూడా ఏర్పాటు చేశారు.