Politicla Eye

గొర్రె తోక బెత్తెడు కాదు… రూ.3.5 కోట్లు!

ఈడెన్ బర్గ్: గొర్రె తోక బెత్తెడు అనే సామెత నిత్యం వింటుంటాం. ఎంత కష్ట పడినా జీవితం మారడం లేదనేది దీనర్థం. కాని ఈ గొర్రె ధర తెలిస్తే షాకవుతాం. ఇంత ధర ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండరు.

స్కాట్లాండ్, లనార్క్ లో జరిగిన స్కాటిష్ పశువుల సంతలో డబుల్ డైమండ్ గొర్రె ధర రూ.3.5 కోట్లు పలకడం విశేషం. ఇప్పటి వరకు ఏ గొర్రెకు రాని ధర రావడంతో యజమాని సైతం ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు సుమారు రెండున్నర కోట్ల రూపాయలకు విక్రయించిన రేటును ఈ గొర్రె బ్రేక్ చేసింది. దీని తరువాతి స్థానంలో హెక్సెల్ డాంగో గొర్రె నిలిచింది. మన దేశంలో గొర్రెలకు ఈ రేటు ఎప్పుడు పలుకుతాయో మరి.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like