అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను వద్దన లేదా ? ఇళ్ల పట్టాలను కేసులతో అడ్డుకోలేదా ? అంటూ ప్రశ్నించారు. జగన్ కేబినెట్లో ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ మంత్రులుగా ఉన్నారని తెలిపారు. పేదలను అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు.