తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. గత పదేళ్లుగా.. టాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన ఈ సీనియర్ బొద్దుగుమ్మ.. నేటి యువ హీరోయిన్లతో కూడా పోటీ పడ్డారు.
అయితే ఇంత గుర్తింపు ఉన్నప్పటికీ అనుష్క సోషల్ మీడిలో ఎక్కడా కనిపించదు. దీనిపై ప్రశ్నించగా..తనకు సినిమాలు తప్ప వేరే విషయాలను పట్టించుకోనని తేల్చిచెప్పేశారు. కొత్తవారితో స్నేహాలు చేయనని తెలిపారు.