పొలిటికల్ ఐ: తెలంగాణ మహిళ ఫైర్ బ్రాండ్ గా ఉన్న గద్వాల జేజమ్మ ,మాజీ మంత్రి డీ కె అరుణ కి బీజేపీ జాతీయ టీమ్ లో ప్లేస్ దక్కింది..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించిన టీమ్ లో డీకే అరుణ కు జాతీయ ఉపధ్యక్షురాలిగా స్థానం దక్కింది. దింతో డీకే అరుణ వర్గం ఖుషి ఖుషి గా ఉంది.కాంగ్రెస్ పార్టీ వీడే ముందు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందని వార్తలు వినిపించాయి. ఐతే అందరూ రాష్ట్ర అధ్యక్షురాలిగా అధిష్టానం నియమిస్తుందని భావించారు. కానీ అక్కడ నిరాశే మిగిలింది. ఇక అందరు పార్టీ మరి తప్పు చేసిందేమో అనుకునే సమయంలోనే బీజేపీ అధిష్టానం ఒక విలువైన పోస్ట్ ఇచ్చింది మాట నిలబెట్టుకుంది..మొత్తానికి డీకే కి పోస్ట్ ఇవ్వడం వెనుక టీఆరెస్ పార్టీ ని టార్గెట్ చేయడమే ప్రధాన లక్ష్యమని అప్పుడే వార్తలు వినిపిస్తున్నాయి.చూద్దాం అరుంధతి పాత్ర ఎలా ఉండబోతోందో ఉంటుందో …! డీకే అరుణ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి ,బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ , బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ , బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య నియమితులైయ్యారు..