సిద్దిపేట: ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గజ్వెల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4.10 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు గజ్వెల్ నియోజక వర్గానికి రూ.46 కోట్లు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నట్టు తెలిపారు.