పొలిటికల్ ఐ:వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా పేరున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఇప్పుడు మరోసమస్య ఎదురుపడింది.. తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ఒక రియల్ స్టోరీ ని తెరకెక్కించాలని భావించారు రాము. ఐతే ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడేలా ఉంది.దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు వర్మ సినిమా నిర్మించాలని భావించారు. సినిమా దాదాపుగా మొదలు పెట్టేవారకు పోయింది. ఐతే సినిమా నిర్మాణం ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు విచారించారు. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు నివేదించారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి..కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. దింతో వర్మ సినిమా నిలిపివేసి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఆగిపోతే వర్మ నెక్స్ట్ మూవీ ఎలాంటి వివాదాస్పద కధ తో వస్తారో చూడాలి.
Get real time updates directly on you device, subscribe now.
Next Post
You might also like