పొలిటికల్ ఐ: సాదారణంగా ఎవరి పొలంలోనైన వరి, మొక్కజొన్నలు, మిరప, కందుల, అనేక రకాల పంటలు పండుతాయి.. కానీ ఆ రైతు పొలం లో మాత్రం వజ్రాలు ఉన్నాయి. అదేంటి అనుకుంటున్నారా.. ఐతే మిరే చదువండి…కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ జియలాజికల్ సర్వే ఇండియా గతంలో చేసిన ప్రకటనకు బలం చేకూరింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ పరిమాణంలో వజ్రం దొరికింది. సదరు రైతు బాగా చదువుకున్నవాడు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ రాయిని హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో అది వజ్రమేని తేలింది. అంతటితో సంతృప్తి చెందిన సదరు రైతు.. ల్యాబ్ నివేదికను వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌కు చూపించాడు. ప్రొఫెసర్ కూడా అది వజ్రమేనని నిర్థారించారు. ఈ విషయం బయటికి వస్తే తన భూమిని ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళన చెందిన రైతు.. దాన్ని బయట పెట్టొద్దంటూ ఆ ప్రొఫెసర్‌ను వేడుకున్నాడు. ఈనెల మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు శతాబ్దాల కిందటే మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరకడంతో జీఎస్ఐ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు పాటు సర్వే చేశారు. ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది. ఆయా జిల్లాల్లో ఏఏ ప్రాంతాల్లో ఉన్నాయో మ్యాపులు సైతం ఖరారు చేశారు. దీనిపై ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు.
Get real time updates directly on you device, subscribe now.