పొలిటికల్ ఐ:మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్సమెన్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్ కింగ్స్ పై తనదైన శైలిలో ఒక సెటైర్ వేసి వార్తలో నిలిచాడు. ఐపీఎల్ లో చెన్నై ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడిన ఆ టీమ్ బ్యాట్స్‌మెన్‌పై వ్యంగ్యాస్త్రాలు మిరే చూడండి..వారు తమ ఫ్రాంచైజీని ప్రభుత్వ ఉద్యోగంలా భావిస్తు న్నట్టున్నారని అన్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభం లభించినా చివరికి కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ముఖ్యంగా కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించాల్సింది పోయి 12 బంతుల్లో ఏడు పరుగులే చేశాడు. ఐతే ‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో జాదవ్, జడేజా డాట్ బాల్స్ ఆడటం వల్ల జట్టు నష్టపోయిందని తన అభిప్రాయం ప్రకారం పలువురు బ్యాట్స్‌మన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రభుత్వం ఉద్యోగంగా భావిస్తున్నారని ఎందుకంటే రాణించినా.. లేకపోయినా తమ వేతనానికి ఢోకా ఉండదనే విషయం వారికి బాగా తెలుసు’ అని తనదైన శైలిలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
Get real time updates directly on you device, subscribe now.