హైదరాబాద్: ఒకే వ్యక్తికి రెండోసారి కూడా కరోనా సోకిన కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. ఇలా నమోదైన కేసులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మొదటి సారి సోకిన దానికంటే రెండో సారి సోకిన కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల చివరికి కేసులు తగ్గుతాయని, కాకపోతే జిల్లాల్లో, గ్రామాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు కేవలం 0.7 శాతమే ఉందని తెలిపారు.