ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2,48,97,792 కు చేరింది.
ఇప్పటి వరకు కరోనా బారిన పడి 8,40,660 మంది మృత్యువాత పడ్డారు. కాగా మొత్తం బాధితుల్లో 1,72,86,544 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి.