ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,42,688 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,22,499 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
కరోనా బారిన పడి 1,65,91,338 మంది కోలుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదౌతున్నాయి. నేటికి అమెరికా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,54,816 కి చేరింది. 1,82,376 మంది మృత్యువాత పడ్డారు.