హైదరాబాద్: కరోనా మహమ్మారి వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా సినీ నటి తమన్నా కుటుంబంలో కూడా కరోనా తీవ్ర కలకలం రేపుతోంది.
తన తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారంటూ.. స్వయంగా తమన్నానే ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. గత కొన్ని రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు తెలిపింది.