పొలిటికల్ ఐ : రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ ఇళ్లు ముట్టడించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.మినిస్టర్ క్వాటర్స్ లోని హోమ్ మినిస్టర్ నివాసం ముందుకు చేరుకొని రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు ,హత్యలపై నిరసన తెలిపారు. హోం మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.తన మంత్రి పదవి కి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.తెలంగాణ లో శాంతి బత్రతలు పూర్తిగా క్షీణించాయి ..ఉత్తర్ ప్రదేశ్లో మారిదిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి..దోషులకు ఉరి శిక్ష వేయాలి.నిన్న కేసీఆర్ శాంతి భద్రాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని అన్నారు. కేసీఆర్ కు సిగ్గు ఉందా అని సంపత్ కుమార్ ప్రశ్నించారు .మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టిఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేస్కున్నట్టు చిత్రీకరించారని విమర్శించారు .
ఇది ఆదర్శంగా ఉందా..ఖమ్మంలో బాలికపై అత్యాచారం యత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు, ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరమర్శించారా..అని నిలదీశారు .దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ,ఎన్ఎస్యూ ఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ రావు , మైనారిటీ సెల్, ఎస్సి సెల్ కార్యకర్తలు ముట్టడించారు . దింతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ..