చెన్నై: ఇప్పటి వరకు సామాన్యులనే బలి తీసుకుంటున్న కరోనా వైరస్ క్రమంగా రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. తమిళనాడులోని కన్యాకుమారి నియోజకవర్గం ఎంపీ హెచ్.వసంత కుమార్ కరోనా వైరస్ తో పోరాడి మృతి చెందారు.
వైరస్ లక్షణాలు కన్పించడంతో ఈ నెల 10వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరారు. మూడు వారాలుగా చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. తమిళనాడులో అతి పెద్ద గృహోపకరణాల రిటైల్ చైన్ అయిన వసంత్ అండ్ కో ను ఎంపీ వసంత్ స్థాపించి పేరు గడించారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు సమీప బంధువు కూడా.