ఢిల్లీ: కరోనా మహమ్మారితో ఉపాధి లేక, పనులు దొరక్క పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని… వారిని ఆదుకునేందుకు నగదు పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా హెచ్చరికను ప్రస్తావిస్తూ రాహుల్ తన ట్వీట్ లో లేవనెత్తారు. కొన్ని నెలల నుంచి ఇదే అంశాన్ని తెలియచేస్తున్నానని, ఇఫ్పుడు ఆర్.బీ.ఐ కూడా ధృవీకరించిందన్నారు. ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేయాలని, రుణాలు ఇవ్వడం ఎంతమాత్రం కరెక్టు కాదని ఆర్.బీ.ఐ స్పష్టం చేసిందన్నారు. పేదలకు ఇస్తే మళ్లీ ఖర్చు చేస్తారని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని, వారికి రాయితీలు ఇవ్వవద్దన్నారు.
ఆర్.బీ.ఐ మంగళవారం తన వార్షిక నివేదికను విడుదల చేస్తూ, కరోనా కారణంగా ఆర్థిక లక్ష్యాల సాధన కష్టతరం అని వ్యాఖ్యానించింది. రానున్న కలంలో ద్రవ్యోల్బణం మరింత పైకి వెళ్లే ప్రమాదముందని గుర్తు చేసింది.
https://twitter.com/RahulGandhi/status/1298516995101450240