హైదరాబాద్: కరోనా పాజిటివ్ సోకి విషమ స్థితిలో ఉన్నవారు ప్లాస్మా వల్ల చాలా వరకు రికవరీ అవుతున్నారని హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. అందరి ద్యేయం ఒకటే.. కరోనా పై పోరాటం.. కరోనాను జయించడమన్నారు.
కరోనా పాజిటివ్ పట్ల భయం వద్దు.. రోగం భయంతో ఆత్మ హత్యలు వద్దు అని ఆయన పిలుపునిచ్చారు. వ్యాధి విషయంలో ప్రభుత్వం ప్రజలపై వదిలేయొద్దు.. ప్రజలు లైట్ గా తీసుకోవద్దు అని బాలకృష్ణ అన్నారు. సినిమా షూటింగ్ ల పై త్వరలోనే కూర్చుని నిర్ణయం తీసుకుంటామని, వీటిని ప్రారంభిస్తే అన్ని విభాగాల వారు రావడం మూలంగా జనసందడిగా మారుతుందన్నారు.
కోవిడ్ నిబంధనలకు లోబడి షూటింగ్ లు చేసుకోవాల్సి ఉంటుందని, త్వరలోనే నిర్ణయo తీసుకుంటామమని బాలకృష్ణ తెలిపారు.