భోపాల్: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. దేవాస్ జిల్లాలోని లాల్ గేట్ ప్రాంతంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది.
ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే ఆసుపత్రి తరలించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ విపత్తు భద్రతా సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నది. స్థానిక సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం.