Politicla Eye

కోహ్లీ, రోహిత్ మధ్యలో ఏం జరుగుతోంది?

పొలిటికల్ ఐ: కోహ్లీ రోహిత్ ఇద్దరూ స్టార్ ప్లేయర్లే, ఇద్దరు కెప్టెన్ గా నిరూపించుకున్నవాళ్లే. కానీ ఇద్దరి మధ్య గత రెండేళ్లుగా కోల్డ్ వార్ జరుగుతుంది. గత సంవత్సరం జరిగిన టీం సెలక్షన్ లో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం. ఐపీఎల్ లో కూడా ఇద్దరు మాచ్ లో సరదాగా ఉంటున్నప్పటికీ ఎదురుపడినప్పుడల్లా మొహాలు తిప్పుకుంటూనే కనపడుతున్నారు. పంజాబ్ పై మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయాక రోహిత్ ట్విట్టర్ లో వెటకారం గా ట్వీట్ చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది. అది మాత్రమే కాకుండా రోహిత్ కి రవి శాస్త్రీ సపోర్ట్ కూడా ఉంది. విరాట్ ని తప్పించి రోహిత్ కి పగ్గాలు అప్పగించే ఆలోచనలతోనే రవి శాస్త్రి కూడా రోహిత్ కి అండగా ఉన్నాడు. ఏదేమైనా ఇద్దరి మధ్య విబేధాలు తొలిగిపోతే ఇద్దరు ఇండియా టీంకి ఎంతో బలాన్ని చేకూర్చుతారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like