Politicla Eye

ఈ రెవిన్యూ చట్టంతో భూపంచాయితిలకు చెక్ పెట్టొచ్చు..సీఎం కేసీఆర్

కొత్త రెవిన్యూ చట్టంతో భూపంచాయితికి చెక్ పెట్టిన్నట్లు అవుతుంది…సీఎం కేసీఆర్

* కొత్త రెవెన్యూ చట్టం తేవడానికి ముందు VRO వ్యవస్థ రద్దు..సీఎం

* VRO లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..సీఎం

* కొత్త రెవెన్యూ చట్టం పేదలకు రైతులకు మేలు చేస్తుంది…సీఎం

* తెలంగాణలో ఉన్న భూములను ప్రభుత్వమే డిజిటల్ సర్వే చేస్తుంది…సీఎం

* వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు ఇకపై తహసీల్దార్ వద్దనే ..సీఎం

* రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్ లకు సబ్ రిజిష్టర్ బాధ్యతలు..సీఎం

* రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు…సీఎం

* భూములకు సంబంధించిన కేసులను నేరుగా కొర్టులలో పరిష్కార ము చేసుకోవాలి..సీఎం

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 9 : తెలంగాణ అసెంబ్లీ లో ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశ పెట్టింది. పంచాయతీ సవరణ బిల్లు, మున్సిపల్ చట్టం, VRO వ్యవస్థ రద్దు తో పాటు…రెవెన్యూ చట్టం లను సభలో ప్రవేశ పెట్టారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ చట్టం ప్రవేశ పెట్టి సవివరంగా చట్టం పై క్లారిటీ ఇచ్చారు. దీనిపై సభలో శుక్రవారం సభలో చర్చ చేపట్టనుంది. ఒక రోజంతా చర్చ చేపట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.కొత్త రెవెన్యూ చట్టం తో తెలంగాణలో భూ పంచాయతీలకు చెక్ పెట్టినట్టు అవుతుందన్నారు సీఎం.కొత్త రెవెన్యూ చట్టం తేవడానికి ముందు VRO వ్యవస్థ రద్దు బిల్లు ను సభలో ప్రవేశ పెట్టారు. అయితే VRA లకు ప్రభుత్వ స్కెల్ ఇస్తామని ప్రకటించారు. VRO లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా శాఖలకు బదిలీ చేస్తామని ప్రకటించారు కేసీఆర్.కొత్త రెవెన్యూ చట్టం పేదలకు..రైతులకు మేలు చేస్తుందని అత్యంత ఆనందం కలిగించిన సందర్భంగా వర్ణించారు సీఎం కేసీఆర్. త్వరలో తెలంగాణలో ఉన్న భూములను ప్రభుత్వమే డిజిటల్ సర్వే చేస్తుందని ప్రకటించారు. ధరణి వెబ్ సైట్ లో వ్యవసాయ,వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ల ను ఇకపై తహసీల్దార్ వద్దనే చేసుకునేలా చట్టం రూపొందించమన్నారు. మ్యూటేషన్ కూడా వెంటనే అమలు చేసేలా చట్టాన్ని రూపొందించినట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్ లకు సబ్ రిజిష్టర్ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్టు స్పష్టం చేశారు సీఎం. వ్యవసయేతర భూముల రిజిస్ట్రేషన్ మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీసులో నే చేసుకోవాలని చెప్పారు సీఎం.వ్యవసాయ భూముల విషయంలో మాత్రం ప్రభుత్వ భూములు,సీలింగ్ ల్యాండ్స్ వాటి రిజిస్ట్రేషన్ చేసుకునే విలే లేకుండా ధరణి లో రూపొందిస్తున్నట్టు సీఎం చెప్పుకొచ్చారు.

తెలంగాణ లో సుమారు 12 వేల భూ సంబంధించిన కేసులు ఎమ్మార్వో , ఆర్ డీఈవో,జాయింట్ కలెక్టరు ల కోర్టులో కేసులు ఉన్నాయని అన్నారు. రెవెన్యూ శాఖలో ఉండే ఈ మూడు కోర్టులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం. ప్రస్తుతం రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి.. కేసులను పరిష్కారం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కూడా నిర్దిష్ట గడువు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాత భూములకు సంబంధించిన కేసులను నేరుగా కొర్టులలో పరిష్కార ము చేసుకోవాలి ఉంటుందని ప్రకటించారు కేసీఆర్..

Get real time updates directly on you device, subscribe now.

You might also like