అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలను జారీ చేసింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఉంచిన యుద్ధవిమాన వాహక నౌకలు రెండింటిని లక్ష్యంగా చేసుకొని భారీ క్షిపణులను ప్రయోగించింది.
అయితే ప్రయోగించిన రెండు క్షిపణులూ అమెరికా నౌకలకు కొద్ది దూరంలోనే పడిపోయినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా తమ జలాల్లోకి వస్తే క్షిపణులతో సమాదానం చెప్తామంటూ అమెరికాను హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. దీనిపై స్పందించిన అమెరికా.. చైనా సైనిక విన్యాసాల్లో భాగంగా ఆ క్షిపణులను ప్రయోగించినట్టు పేర్కొంది.