రమేష్ చెన్నామనేని పౌరసత్వం కేసు వివరాలు
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 7: ఎమ్మెల్యే రమేష్ చెన్నామనేని పౌరసత్వ కేస్ వివరాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ ఎంపీ పొన్నం ప్రభకర్.1993 సంవత్సరంలో రమేష్ చెన్నమనేనీ జర్మనీ పౌరసత్వ తీసుకున్నాడని ఆనాడే భారతదేశం పౌరసత్వం వదులుకొని తిరిగి 2009 సంవత్సరం లో ఫిబ్రవరి 3 న భారతదేశ పౌరసత్వం పొందారని అది కూడా మోసపూరిత ధ్రువీకరణ పత్రాలతో అని తెలిపారు.ఆది శ్రీనివాస్ గారు రమేష్ చెన్నమనేని తప్పుడు ధ్రువీకరణ పాత్రలతో మోసపూరితంగా సిటిజన్ షిప్ ఆక్ట్ 1955 -5-1-f చట్టాన్ని ఉల్లంఘించి పౌరసత్వం పొందాడని హోమ్ శాఖ లో న్యాయం స్థానాలలో ఛాలెంజ్ చేయడం జరిగిందని గౌరవ న్యాయస్తానం విచారణ జరిపి 2013 ఆగస్ట్ 14 న రమేష్ చెన్నామనేని భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తూ ఓటర్ లిస్ట్ లో పేరును తొలగిస్తూ MLA పదవిని కూడా రద్దు చేశారని అన్నారు.రమేష్ సుప్రీం కోర్ట్ కి వెళ్లి ఈ అంశంలో స్టే తెచ్చుకున్నాడని ఐతే ఆది శ్రీనివాస్ స్టే ఎత్తి వేయాలని సుప్రీంకోర్టుని కోరగా న్యాయస్థానం లో రమేష్ చెన్నమేని హోమ్ శాఖలో కూడా అది శ్రీనివాస్ గారు విజ్ఞప్తి చేసినందున హోమ్ శాఖనే తేల్చాలని కోరారు.సుప్రీంకోర్టు న్యాయస్థానం 2016 లో పౌరసత్వం అంశం హోమ్ శాఖ వెంటనే తేల్చాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.కేంద్ర హోంశాఖ విచారణ జరిపి మొదటి సారి 2017 ఆగస్ట్ లో ఒక్కసారి రెండవసారి డిసెంబర్ 2107 లో మూడవసారి 2018 నవంబర్ లో భారతీయ పౌరసత్వం రద్దు చేసిందన్నారు.ప్రస్తుతం హైకోర్టు లో ఈ అంశంపై స్టే రావడం జరిగిందని స్టే వచ్చిన తదుపరి వాదనలు జరుగుతున్న సమయంలో 2020 ఫిబ్రవరి లోఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ నే వాడుతూ డిసెంబర్ 2019 లో జర్మనీ పాస్ పోర్ట్ పైన చెన్నై నుండి ప్రయాణం చేసినట్టుగా కేంద్రం హోమ్ శాఖ తెలంగాణ న్యాయ స్థానంలో లేఖ ఇవ్వడం జరిగిందన్నారు.గత 11 సంవత్సరాలుగా ముమ్మాటికీ నేను భారతీయుణ్ణి అంటూ అదికారంలో ఉంటూ జర్మనీ పాస్పోర్ట్ మీద ఎలా ప్రయాణం చేశాడు ఇది ముమ్మాటికీ భారతదేశం చట్టాన్ని ఉల్లంఘించడమే కదా అని ప్రశ్నించారు.భారతీయ పౌరసత్వం పొందినప్పుడు కూడా చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు పత్రాలతో పొందాడు దాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికి జర్మనీ పాస్పోర్ట్ పై ప్రయాణం చేస్తున్నందున భారతదేశ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇతనికి లూకౌట్ నోటీస్ జారిచేయాలి భారతదేశ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని నాలుగు సార్లు రమేష్ చెన్నామనేని భారత దేశం పౌరుడు కాదని తీర్పులు వచ్చాయి (మూడు సార్లు హోమ్ శాఖ ద్వారా ఒక్క సారి ఆంద్రప్రదేశ్ హైకోర్టు ద్వారా) అని తన వీడియో సందేశం లో తెలిపారు.