ఎల్ రమణ ను తొలిగించండి…?
పొలిటికల్ ఐ : ఒకవైపు ఏపీ లో టీడీపీ అధికారం కోల్పోయి అధికార వైసీపీ తో ఉన్న నేతలతో పోరాడుతూ వస్తుంది..ఇదిలా ఉంటె తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొంత టీ టీడీపీ అధ్యక్షుడి పై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు బయటికి వస్తున్నాయి.. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతలు కొందరు తిరుగుబాటుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది…! తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ కొంత మంది నేతలు అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన్నట్లు సమాచారం…?ఈ లేఖ లో గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారటా. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని వివరిస్తూ, కింది స్థాయి కార్యకర్త నుంచి పార్లమెంటు ఇంఛార్జి, కోర్ కమిటీ వరకు ఈ మేరకు తమ డిమాండ్లు తెలుపుతూ లేఖ రాశారటా..!
ఏదిఏమైనా లేఖ రాసిన వారు కొంత వరకు సరిగా నే రాశారు కానీ అలాగే ప్రస్తుతం టీ టీడీపీ లో ఉన్న నేతల్లో ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో కూడా రాస్తే బాగుండేదని రాజకీయ వర్గాల్లో కొంత హాస్యాస్పదంగా చిట్ చాట్ చేసుకుంటున్నారటా..!