స్కూల్స్ రీఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ 21 వ తేదీ నుండి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి దీనికోసం కేంద్రం మార్గదర్శకాలని విడుదల చేసింది.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు ఇవే …….
1 ) విద్యార్థుల తల్లితండ్రుల నుండి లిఖిత పూర్వక ఆమోదం తప్పనిసరి.
2 ) కంటోన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న స్కూల్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చింది .
3 ) స్కూల్స్ ఓపెన్ చేయటానికి ముందే 1 % సోడియం హైపోక్లోరైడ్ సొలనే తో శానిటైజ్ చేయాలి.
4 ) టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో కలిపి 50 % సిబ్బంది తోనే స్కూల్స్ ని నడిపించాలి.
5 ) స్కూల్స్ యాజమాన్యం బయో మెట్రిక్ కి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలి.
6 ) కరోనా గురించి అవగాహన కలిపించేలా పోస్టర్లు ఏర్పాట్లు చేయాలి..
7 ) బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే కరోనా ప్రోటోకాల్ తప్పకుండ పాటించాలి.