అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోదీని కోరారు. ఇవాళ పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఈ లేఖలో పలు విషయాలు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021 చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తక్షణమే రూ.3,805.62 కోట్లను రియింబర్స్ చేయాలని కోరారు.