గత కొన్ని రోజులుగా కాలిఫోర్నియా అడవులనును కార్చిచ్చు కబళిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో అడవులు అగ్నికి ఆహుతైనాయి. అక్కడి అధికారులు మంటలను ఆర్పేందుకు శత విధాలా ప్రయత్నించినప్పటికీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు.
అనేక వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. కార్చిచ్చుతో అక్కడి వాతావరణం గణనీయంగా వేడెక్కుతోంది. పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలను అదుపు చేయలేకపోతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.