Politicla Eye

బైక్ పైనే పేలిన బాంబు

చెన్నై: బైక్ పై తీసుకెళుతున్న బాంబు పేలి ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా, తిరుపారూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇద్దరు వ్యక్తులు బాంబులను సంచిలో పెట్టుకొని బైక్ పై తీసుకెళుతుండగా.. అందులో ఒక బాంబు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో వారిద్దరికి తీవ్ర గాయాలైనాయి. అప్రమత్తమైన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, మిగతా బాంబాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుతెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like