ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 15; తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.సెప్టెంబర్ 17 ని ఉదేశించి టీఆరెస్ – ఎంఐఎం పార్టీ ల పై విమర్శల బాణం విడిచారు.ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి బండి సంజయ్… మజ్లిస్ తో అంటకాగి తెలంగాణ చరిత్రను సీఎం కేసీఆర్ కలరాస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను నిజాం ఘోరీ వద్ద తాకట్టుపెట్టిన నయా నిజాంగా మారారని ఆరోపించారు.మా తెలంగాణ రాజు తరతరాల బూజు అంటూ ట్వీట్ చేశారు.ఇక సెప్టెంబర్ 17 నతెలంగాణ విమోచన దినం నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.