రాజాసింగ్ కు భద్రత పెంచిన పోలీసులు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ పోలీసులు భద్రత పెంచారు. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉందన్న సమాచారంతో అప్రమత్తమైనట్టు హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే బైక్ పై తిరగవద్దంటూ సూచించారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాలని రాజాసింగ్ కు సూచించారు.