వికారాబాద్: ఓ మహిళపై బీహార్ యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన జిల్లలోని పరిగి మండలం రాపోలులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక రాపోలులో బీహార్ కు చెందిన ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడు.
మహిళ కేకలు వేయడంతో స్థానికులు నిందితున్ని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.