లక్నో: దేశంలో కరోనా బాధితుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో గ్రామీణ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న రాజేష్ అనే 40 ఏండ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డాడు.
దీంతో తీర్దాంకర్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ అతను హాస్పిటల్ 6వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.