Politicla Eye

పాటల స్వరం ఆగిపోయింది….!

పొలిటికల్ ఐ సెప్టెంబర్25 2020: సుబ్రమణ్యం పేరు తెలియని వారు ఉండరు.. ఆయన పాడిన పాటలు వినని వారు ఉండరు.ఎందుకంటే బాలు పాడిన పాటలు అన్ని ఇన్ని కాదు …అలాగే కేవలం ఒకే భాషకు పరిమితం కాలేదు.దట్ ఇస్ బాలు..కేవలం పాటలతోనే కాదు తన నటన తో, డబ్బింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..ఐతే 2020 ఆగస్ట్ 5న బాల సుబ్రమణ్యం కారోనో లక్షణాలతో చెన్నై లోని ఎంజీఎం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.సుమారు 40 రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ వచ్చారు.ఒకటి రెండు రోజుల్లో డిశ్ ఛార్జ్ అవుతారని బాలు కుమారుడు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసాడు.కానీ హఠాత్తుగా బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షిణించింది.

బాల సుబ్రమణ్యం నెల్లూరు దగ్గరలోని కొనేటమా పేటలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు..బాలు తండ్రి సంబమూర్తి హరికథలు చెప్పడం లో నిపుణుడు. సంబమూర్తి కి మొత్తం ఎనిమిది మంది సంతానం ఇందులో బాలు రెండో సంతానం..బాలు కి ఒక అన్నయ్య, తమ్ముడు ,5 గురు అక్క చెల్లెలు ..

* బాలు చెల్లెలు ఎస్పీ శైలజ నటి మరియు గాయని.శైలజ సినీ ఇండస్ట్రీ లోని నటుడు శుభలేఖ సుధాకర్ ని పెళ్లి చేసుకుంది..

* బాలు కి ఇద్దరు సంతానం కూతురు పల్లవి , కొడుకు ఎస్పీ బీ చరణ్

*బాలు డబ్బింగ్ చెప్పిన స్టార్స్*

రజనీకాంత్, కమలహాసన్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్ ,జెమినీ గణేషన్, నగేష్ ,కార్తీక్, రఘువరన్, వినోద్ కుమార్

*1966 డిసెంబర్ లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలో మొదటి పాట పాడిన బాలు..*

* 40 వేలకు పైగా పాటలు , 16 భాషలో పాడిన బాల సుబ్రమణ్యం

మొత్తం అన్ని భాషలో కలిసి 77 సినిమాలో నటించారు.

* పురుషుల్లో అత్యధిక పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఎక్కారు..

బాల సుబ్రమణ్యం పాడుతా తీయగా కార్యక్రమం లో యాంకర్ మరియు జడ్జిగా బాధ్యతలు నిర్వహించి ఎంతో మంది గాయకులు ఇండస్ట్రీ కి పరిచయం చేశారు.స్టార్ మా లో పాడాలని ఉంది అని కార్యక్రమానికి కూడా హోస్ట్ గా నిర్వహించారు.

దింతో పాటు ,కన్నడ, తమిళ్ లో కూడా షో లకి హోస్ట్ గా ఉన్నారు..

*బాల సుబ్రమణ్యం అందుకున్న అవార్డ్స్ ఇవే*

* 1986 నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మయూరి సినిమా

* పద్మశ్రీ , GIMA, 1990 లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ (హిందీ), ఫిల్మ్ ఫేర్ (తెలుగు), 2007 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ,

* 1996 1989,1996,1997 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ .

* 1996 పత్రిబంధం సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డ్

* 2012 శివాజిగానేషన్ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా

*2011 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ మేల్ ప్లే బ్యాక్ సింగర్

* 2012 లో విజయ్ అవార్డ్ ఫర్ ప్లే బ్యాక్ సింగర్

* 1997 అన్నయ్య సినిమా కి గాను నంది అవార్డ్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ..

* 2003 మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ ( శ్రీ సాయిమహిమ చిత్రానికి )

* 2004,2006,2010 నంది అవార్డ్ ఫర్ ప్లే బ్యాక్ సింగర్ గా

*మొత్తం 6 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్*

*25 నంది అవార్డ్స్*

*6 ఫైల్ ఫేర్ అవార్డ్స్*

*1 ఎన్టీ ఆర్ నేషనల్ అవార్డ్*

*అలాగే పద్మశ్రీ , పద్మభూషణ్ గౌరవం కూడా బాలు కి దక్కింది..*

*ఒక్కప్పుడు బాల సుబ్రమణ్యం ఉన్న బిజీ సమయంలో 12 గంటలో 17 పాటలు పడేవారు..*

Get real time updates directly on you device, subscribe now.

You might also like