విశాఖపట్నం: దళిత యువకునికి శిరోముండనం చేసిన దారుణ ఘటన జిల్లాలోని పెందుర్తి మండలం సుజాతనగర్ లో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ అనే దళిత యువకుడు పనిచేసి మానేశాడు.
అయితే నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో సెల్ ఫోన్ చోరీ చేశాడని ఆరోపిస్తూ శ్రీకాంత్ శిరోముండనం చేశారు. ఈ ఘటనపై శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.