దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించాలి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్
* మనం తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్ ను గెలిపించాలి .దామోదర్ రాజనర్సింహ
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ కార్యకర్తల దృఢ సంకల్పంతో క్రమశిక్షణ తో పని చేయాలని దుబ్బాక ఉప ఎన్నికలలో చరిత్ర సృష్టించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.శుక్రవారం ఇందిరా భవన్ లో పీసీసీ చీఫ్ అధ్యక్షతన దుబ్బాక ఉప ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశం లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, దుబ్బాక నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ … దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ నిలదీయాలని అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయాలని మూడు రోజులో అన్ని కమిటీలు పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశం లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ…రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన నడుస్తుందని అప్పులు, అవినీతి తెలంగాణ లా మరిపోయిందని విమర్శించారు.నేడు మనం ఒక నియంతతో పోరాటం చేస్తున్నామని ఖచ్చితంగా దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచే విదంగా అంత కలిసి పోరాటం చేయాలని కోరారు.
దామోదర్ రాజనర్సింహ
ఎన్నికలు అనగానే డబ్బు సంచులతో, మద్యం బాటిళ్లతో టిఆర్ఎస్ నాయకులు మీ దగ్గరకు వస్తారని కానీ మనం తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.