Politicla Eye

విసిల నియామకం పూర్తి చేయాలి: కేసీఆర్

హైదరాబాద్: విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. విసిల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, విసిల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని సిఎం వివరించారు.

కరోనా నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందని సిఎం చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విసిల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like