హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం తోపాటూ.. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని తెలిపింది. జార్ఖాండ్ నైరుతి పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.