ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోసారి ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ కు రెండో లేఖ రాసింది. దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరేయడంలో ఫేస్ బుక్ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసీ.వేణుగోపాల్ ఫేస్ బుకు సీఈఓ జూకర్ బర్గ్ కు రెండో లేఖ రాశారు. విద్వేష వార్తలు, సమాచారాన్ని నిరోధించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ లేఖలో డిమాండ్ చేసింది. హేట్ స్పీచ్ పాలసీకి విరుద్దంగా బీజేపీ దాసోహమైందని, దిద్దుబాటు చర్యలకు ఇప్పటికీ సమయం మించిపోలేదని కాంగ్రెస్ కోరింది. ఇండియాతో పాటు అమెరికా, బ్రిటన్ దేశాల్లో కూడా ఫేస్ బుక్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.