లక్నో: లఖింపూర్ ఖేరి జిల్లా నిమ్ గౌన్ ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న బాలపై అత్యాచారం చేసి, హత్య చేశారు. బాలిక స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేయడానికి సమీప పట్టణానికి వెళ్లిన సమయంలో దుండగులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.
వారం రోజుల క్రితం 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం జరగడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలిక ఇంటికి సమీపంలోని నీటి కుంటలో మృతదేహం పడి ఉంది. మంగళవారం ఉదయం గడ్డి కోసం పశువుల కాపరులు వెళ్లగా మృతదేహం కన్పించడంతో గ్రామ పెద్దకు సమాచారం ఇచ్చారు.
బాలిక మృతదేహం మెడ దగ్గర గాయం ఉండగా, కాలిపై కొంత భాగాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని లఖీంపూర్ ఖేరి జిల్లా ఎస్పీ సత్యేంద్ర కుమార్ తెలిపారు.